శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో త్రినేటి సంస్థ ఆధ్వర్యంలో 126వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన శంకర్ కంటి అసుపత్రి వైద్యులు యశస్వి, షిఫా కంటి జబ్బులతో బాధపడుతున్న 550 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 175 మందికి కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వీరందరికీ బెంగుళూరులోని శంకర్ నేత్రాలయలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు అవసరమైన మందుల , కంటి అద్దాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ, కంటి జబ్బులు వచ్చిన వెంటనే వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిం