సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మృదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించారు సురవరం సుధాకర్ రెడ్డి దేహదానం స్ఫూర్తిదాయకమని గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు, కమ్యూనిస్ట్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సురవరం తమ విద్యార్థులకు తొలి అనాటమీ ప్రొఫెసర్ అవుతారని, ఆయన శరీరం ద్వారా ఎంతో మంది విద్యార్థులు వైద్య శాస్త్రాన్ని నేర్చుకుంటారన్నారు. మరణంలోనూ సేవ చేయాలన్న ఆయన ఆశయం తమకు గొప్పస్ఫూర్తి అని పేర్కొన్నారు