క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు ఆదివారం ఉదయం కుంకుమ పూజ మహోత్సవంను నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. సామూహిక కుంకుమ పూజలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం సుఖంగా జీవించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. అనంతరం మండపాల వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయగా పట్టణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.