గత నెల 16వ తేదీన దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో చోటు చేసుకున్న సైబర్ క్రైమ్ ఫై దమ్మపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం లచ్చపురం గ్రామానికి చెందిన కంపాటి చిలకమ్మా కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎన్ ఎస్ సి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేరుతో టెలిగ్రామ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయమని,మంచి లాభాలు వస్తాయని ఆశ చూపించే ఒక లింకు వచ్చింది.లాభాలకు ఆశపడిన సదరు మహిళ పలు దఫాలో ఆ లింకులో చూపించబడిన బ్యాంకు ఖాతాకు 2,80,000 నగదును జమ చేసింది.ఎంతకు లాభాలు రాకపోవడంతో తను మోసపోయారని గుర్తించిన చిలకమ్మా పోలీసులు నాశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.