గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెం గ్రామంలో పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిరంతరం వైద్య ఆరోగ్యశాఖ ఇతర సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. శనివారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తురకపాలెం గ్రామంలో 650 ఇళ్లకు సర్వే నిర్వహించి సింటమెటిక్ కేసులకు సంబంధించి 56 మందికి బ్లడ్ కల్చర్ తీసి మెడికల్ కళాశాల గ్రూప్ పంపించడం జరిగిందన్నారు.