మదనపల్లి మండలం,అంకిశెట్టిపల్లి సర్వేనెంబర్ 15లోని గుట్ట ప్రభుత్వ భూమి. గుట్టపై బుద్ధుడి విగ్రహం ఏర్పాటుకోసం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. గురువారం రాత్రి వారు మీడియాతో మాట్లాడుతూ.. గుట్ట ప్రభుత్వ భూమి అన్నారు. తమ అనుమతి లేకుండా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి, సభలు సమావేశాలు విగ్రహం ఏర్పాటు నిర్వహించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.