భీమవరం కలెక్టరేట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆందోళనాత్మక వాతావరణం నెలకొంది. వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని సిబ్బంది చెప్పడంతో డయాలసిస్ పేషెంట్లు తీవ్ర ఆందోళనకు గురై కలెక్టరేట్ను ముట్టడించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే డయాలసిస్ రోగులకు వర్మ హాస్పిటల్ మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండటంతో, ఇకపై తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో వారు ఆందోళనకు దిగారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిని కలెక్టరేట్లో నిలదీశారు. తరువాత జాయింట్ కలెక్టర్, డిఎం & హెచ్ఓ పేషెంట్లకు డయాలసిస్ వర్మ హాస్పటలలో జరుగుతుందని హామీ ఇచ్చారు.