నిర్దేశిత గడువులోగా స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తి చేయాలని నగరమే గుండు సుధా నాని ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో నిర్వహించిన స్మార్ట్ సిటీ మిషన్ కు చెందిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా నగర అభివృద్ధికి కొనసాగుతున్న ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న పనులైన భద్రకాళి వడ్డేపల్లి బన్ ఉరుసు రంగసముద్రం అభివృద్ధి పనులు గ్రాండ్ ఎంట్రెన్స్ ఫుడ్ పార్క్ తదితర పనులలో వేగం పెంచాలన్నారు.