నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుడు బిసి నేత డాక్టర్ వకుళాభరణం బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు ఆయనకు సోమవారం ఉదయం బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వకుళాభరణం కృష్ణమోహన్ రాకతో బిజెపి పార్టీ మరింత బలోపేతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి బిజెపి నాయకులు పాల్గొన్నారు.