కామారెడ్డి :మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం 2కే రన్ ను ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవాలని వివిధ క్రీడ కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా యువజన & క్రీడల శాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడాలు నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకూ వివిధ క్రీడా రంగాల్లోని యువకులతో కలిసి 2K రన్ నిర్వహించారు.