శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం సందేబిదనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జావేద్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు కబీర్దాస్, తులసి దాసులు చేసిన సేవలు గురించి హిందీ భాష గొప్పతనం గురించి వివరించారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా గుర్తించడం జరిగిందని పాఠశాల హిందీ పండిట్ తవేరా బేగం తెలిపారు.