ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.