సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం ఐదు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా వెంకటాపురంలోని ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని సరస్వతి దేవి అలంకరణ చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని అదే విధంగా తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేయడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.