జాతీయ విపత్తు కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 10 కోట్లు రూపాయల నిధులను విడుదల చేయాలని AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. మేరకు డిచ్పల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వరి ఎకరానికి 50,000/-, సోయా కు 70000/- ఇవ్వాలన్నారు. అలాగే రైతుల అప్పులను మాఫీ చేయాలని, ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు.