అనకాపల్లి జిల్లా విమాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం వద్ద శనివారం నాడు భారీ గిరి నాగును స్నేక్ క్యాచర్స్ పట్టుకున్నారు. సుమారు 12 అడుగులు పామును చూసిన యువకులు స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం అందించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో తమ ఈజిడబ్యూఎస్ సభ్యులకు తెలపడంతో వారు రాళ్లలో నక్కి ఉన్న గిరినాగును సురక్షితంగా పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. జలాశయం వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాములకు ఆవాసంగా మారాయి.