పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఆకుతీగపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు 30 మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానం పలికి జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.