చిన్నపాటి వర్షానికే భీమ్ గల్ ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు నీటితో నిండిపోతున్నాయి. దీనివల్ల నిత్యం కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం కురిసిన వర్షానికి కార్యాలయాల్లో నీరు చేరడం వల్ల పనులు చేసుకోవడానికి, కార్యాలయాలకు రావడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.