పశ్చిమగోదావరి జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మారుస్తారనే ఆందోళన చెందవద్దని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గణపవరం మండల ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరం నరసయ్య అగ్రహారంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద శ్రీనివాస వర్మను కలిసి తమ ఆందోళనను వెల్లడించారు. ఏలూరు కంటే భీమవరం విద్య, వైద్య, వ్యాపార పరంగా తమకు అనుకూలంగా దగ్గరగా ఉంటుందని అన్నారు.