లింగాల ఘనపూర్ మండలం చీటూరు గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పల బిక్షపతి మరణించగా ఆయన పార్థివా దేహానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించరు. ఆర్ఎంపీ డాక్టర్ గా ఎంతో మందికి వైద్య సేవలు అందించడమే కాకుండా సర్పంచ్ గా గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.బిక్షపతి లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధారమని తెలిపారు..