Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 27, 2025
కందుకూరు పట్టణం 16వ వార్డులోని రైస్ మిల్ నుంచి బండపాలెం వెళ్లే రహదారి మధ్యలో పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో రంధ్రం కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు బుదవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గుంతను పూడ్చాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.