పినపాక మండలం. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన సౌందపు ఈశన్విక్..ఏడాది వయస్సు ఉన్న బాబును సోమవారం రాత్రి వీధిలోకి వచ్చిన ఓ పిచ్చికుక్క ,బాబు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాబు ను ఇంటి వరండాలో ఉంచి తల్లి ఇంటి పని చేసుకుంటుండగా పిచ్చి కుక్క వచ్చి దాడి చేసినట్లు తండ్రి సంతోష్ తల్లి వెన్నెల తెలిపారు. బాబును హుటాహుటిన మణుగూరు, అక్కడి నుంచి భద్రాచలం తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.