ధర్మవరం పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఒకచోట కళ్ళు మూస్తూ తెరుస్తూ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు, కలవల వారి వీధిలో అయోధ్య బాల రాముడి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు, ఆర్యవైశ్యుల కొత్త సత్రంలో మంచు కొండల మధ్య వెలసిన వినాయకుడిని ఏర్పాటు చేశారు. మార్కెట్ వద్ద శివలింగానికి జలాభిషేకం చేస్తున్న బాల వినాయకుడిని ప్రతిష్టించారు.