కామారెడ్డి పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు సోమవారం ఇఎస్ఆర్ గార్డెన్స్ లో రామకృష్ణ మట్, ఇన్ఫోసిస్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా రిలీఫ్ కిట్ అందించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా వరదలు సంభవించి తీవ్ర నష్టం కలిగించిందని అన్నారు. వరద బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు రామకృష్ణ మట్ ముందుకు వచ్చి ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ఇన్ఫోసిస్ మరియు రామకృష్ణ మట్ వారి సహకారంతో ముంపు బాధిత కుటుంబాలకు 334 రిలీఫ్ కిట్స్ అందించారు.