నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే సాయిరెడ్డి శనివారం తెలిపారు. ఘటన ఇందర్వాయి ప్రాంతంలో చోటుచేసుకుందున్నారు. ఇందల్వాయి వాగు బ్రిడ్జి పైనుంచి రైలు రాకను గమనించకుండా ఓ మహిళ వెళుతుండగా రైలు డే కొట్టింది. ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు వయసు 50 సంవత్సరాల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. మృతదేహాన్ని పంచరామా నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సాయి రెడ్డి తెలిపారు.