భీమవరం యూత్ క్లబ్బులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మీడియా సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ విధ్వంసం పాలనపై ఆనాడు సోము వీర్రాజు అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఉద్యమం చేశామన్నారు. అలాగే పేర్ని నాని అసలు నిజాలు దాచి మాట్లాడ్డం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.