జిన్నారం ప్రభుత్వ దవాఖానలో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో రాత్రివేళలలో వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్న ఈ సమయంలో దవాఖానలో కనీస సదుపాయాలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి కరెంటు సమస్యను పరిష్కరించాలని మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కంది ప్రవీణ్, ఎంఆర్పీఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ లింగం డిమాండ్ చేశారు.