భేల్ యూనియన్ మాజీ అధ్యక్షుడు జీ. ఎల్లయ్య మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. భేల్ యూనియన్‌లో 9సార్లు విజయం సాధించి కార్మిక హక్కుల కోసం పోరాడిన ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఎల్లయ్య పార్థివ దేహానికి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ మంత్రి నివాళులర్పించారు.