చీరాల మండలం జాండ్రపేటకు సమీపంలో విశాల్ మార్ట్ వద్ద గురువారం రాత్రి రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఒంగోలు నుండి చీరాల వచ్చిన బస్సు అక్కడ ఆగి ప్రయాణికులను దింపుతుండగా వెనక నుండి వేగంగా వచ్చిన మరో బస్సు దానిని ఢీకొంది.అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామలాదేవి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.