సంతనూతలపాడు లో ఆదివారం జరిగే గణేష్ నిమజ్జోత్సవ ఏర్పాట్లు ఎస్ఐ అజయ్ కుమార్ పరిశీలించారు. గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై ఉత్సవ కమిటీల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జోత్సవ కార్యక్రమాన్ని ప్రశాంతమైన వాతావరణంలో, ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జరుపుకోవాలని ఉత్సవ కమిటీల నిర్వాహకులకు ఎస్ఐ సూచించారు. నిమజ్జనం ఉత్సవ ప్రాంతాలకు చిన్నపిల్లలు, వృద్ధులను తీసుకురావద్దని, నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.