హృదయాన్ని పిండేసే ఘటన..ఎమ్మిగనూరులోని శివ సర్కిల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధురాలిని వదిలి వెళ్లిన దృశ్యం హృదయాన్ని పిండేసింది. 2 రోజులుగా ఆమె రోడ్డు పక్కనే ఉంటూ ఎవరైనా ఆహారం ఇస్తే తిని జీవించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న వేదాస్ స్వచ్ఛంద సంస్థకు చెందిన సునీల్ కుమార్, చికెన్ బాషా ఆమెకు ప్రేమతో సపర్యలు చేశారు. ఆటోలో ఆదోనిలోని జీవన జ్యోతి ఆశ్రమానికి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు.