విభిన్న నృత్యాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త.. సంఘ సేవకులు కమల్ బెయిడ్ అన్నారు.. శనివారం. సీతమ్మధార ఏ.పీ.ఎస్.ఈ.బి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ,ప్రజాపిత బ్రహ్మకుమారీస్వరీయ విశ్వవిద్యాలయంల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి నృత్య పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కమల్ బెయిడ్ మాట్లాడుతూ మన చిన్నారుల ప్రతిభకు తగిన చేయూతను అందించి ప్రోత్సహించాల్సి ఉందన్నారు. మన నృత్యాలు వినువీధుల్లో విశ్వఖ్యాతిని అర్జిస్తున్నాయన్నారు.