నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, బొత్తల పాలెం గ్రామంలో సిపిఐ సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న సిపిఐ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఐ ని ఆదరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.