నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోల చోరి కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఆ ఇద్దరు వ్యక్తుల నుండి నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ కేసును చాకచక్యంగా వ్యవహరించిన నాగిరెడ్డిపేట పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.