నార్నూర్ మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు.ఆసుపత్రిలోని రికార్డులు,రిజిస్టర్ లను పరిశీలించారు.జ్వర సంబంధిత వివరాలను పరిశీలించి మలేరియా, డెంగ్యూ, సాధారణ జ్వరాలకు సంబంధించి రిజిష్టర్ లు వేరువేరు గా ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలియ తిరుగుతూ గర్భిణీ స్త్రీలకు చేస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నార్నూర్ ఏకలవ్య ఆదర్శ పాఠశాల ను సందర్శించి స్టోర్ రూం, డార్మెటరీ, డైనింగ్ హాల్ లను పరిశీలించారు.