మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ కాలనీ, బీసీ కాలనీలో నూతనంగా మంజూరైన ప్రాథమిక పాఠశాలలను గురువారం మంత్రి డా. వాకిటి శ్రీహరి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతీ వాడా, ప్రతీ పల్లె వరకు ప్రభుత్వ సేవలు చేరాలని, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకబడిన వర్గాలు మరింత ముందుకు రావాలనే లక్ష్యంగా దళితవాడల్లో విద్యకు దూరంగా ఉన్న చిన్నారుల పరిస్థితిని గుర్తించి, పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు.