యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శ్రీ సాయి రేడియం షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా వ్యాపించడంతో షాపు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. చుట్టూ దుకాణాల సముదాయం ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు.