మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి.ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ లో జమ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ కార్యదర్శి దుర్గ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ములకలపల్లి మండల పరిధిలో ముకమామిడి గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం మండల మహాసభ మడకం విజయ అధ్యక్షతన నిర్వహించారు.. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ..ఆరు గ్యారెంటీల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని అన్నారు..