బాపట్ల పట్టణ శివార్లలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు.వారు ప్రయాణిస్తున్న బైకును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను పొన్నూరు శ్రీనగర్ కాలనీకి చెందిన మురళి, ఆయన భార్య లక్ష్మీ తిరుపతమ్మలుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.