విద్యార్థులకు నష్టం చేసేవారు, నష్టం కలిగించే వాళ్లు, కష్టపెట్టిన వాళ్లను వ్యతిరేకించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మీ కోసం పని చేయాలన్న ఆలోచనతో, మీ ఆలోచనలు తెలుసుకుందామని, సమస్యలను చూద్దామని, సమస్యలను పరిష్కరించాలని వస్తున్న వారిని వ్యతిరేకించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకున్న వాళ్లమవుతామా లేదా అని ఆలోచన చేయాలన్నారు