రంగనాయక సాగర్ పై కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత ను వివరించే 100 మీటర్ల బ్యానర్ ను మంగళవారం బిఆర్ఎస్ నేతలు ప్రదర్శించారు. రంగనాయక సాగర్ కి వచ్చి చూడు నిన్ను మీ కాంగ్రెసొళ్లను ముంచితే తెలుస్తుంది. కాళేశ్వరం నీల్లా కదా అని వారు విమర్శించారు.' ఇది కదా కాళేశ్వరం ఇదే కదా కాళేశ్వరం ' అనే 100మీటర్ల బ్యానర్ ని రంగనాయక సాగర్ పై ప్రదర్శించారు. అటు చూడు ఇటు చూడు కాళేశ్వరం జలాలు చూడు రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు ఇచ్చారు.రిజర్వాయర్ పై పైకి ఎత్తి, నీటి వద్ద బ్యానర్ ను ప్రదర్శన చేసారు.