ఇంట్లో బడికని చెప్పి వెళ్లి స్కూలుకు డుమ్మా కొట్టి బజార్లో తిరుగుతున్న ఇద్దరు 9వ తరగతి విద్యార్థుల డ్రామాకు వేటపాలెం ఎస్సై జనార్ధన్ తెరదించారు. ఆ ఇద్దరూ మంగళవారం సాయంత్రం కూడా ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఎస్సై జనార్ధన్ కి చెప్పుకోగా ఆయన సీసీటీవీల సాయంతో బజార్లో తిరుగుతున్న వారి జాడను కేవలం అరగంటలో కనిపెట్టి పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు ఎస్.ఐ కి కృతజ్ఞతలు తెలిపారు