తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన మాట్లాడారు. రైతులకు విద్యుత్తు, నీరు, ఎరువులు ఇవ్వలేక , ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. అర్థంలేని కేసులో ఓ తాగుబోతు ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.