సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అవుతుందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ శనివారం అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కూడాను ఆ సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఎంతోమంది రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన నిరుద్యోగులు గత రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల రెట్లు ప్రభుత్వం మూడు రేట్లు పెంచితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు సామాన్య బిల్డర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.