ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఏఎన్ఎం ల పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం లు పనిచేస్తున్న ఏఎన్ఎం లకు యాప్ల వర్క్, ఆన్లైన్ నమోదు ప్రక్రియ వంటి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య సంబంధ పనుల్లో ఉండే ఏఎన్ఎం లకు పని భారాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఏఎన్ఎంలు పాల్గొన్నారు.