మహబూబాబాద్ జిల్లాలో నీటి నుంచి ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పట్టణంలో మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయంతో తయారుచేసిన గణపతి విగ్రహాన్ని బుధవారం మధ్యాహ్నం 12:00 లకు ప్రతిష్టించారు. గోమయంతో తయారుచేసిన వినాయకుడికి నిర్వాహకులు 7 నదుల నీళ్లతో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ గోమయ్య గణపతిని ప్రతిష్టిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.