కూటమి ప్రభుత్వ పాలనలో యూరియా, ఇతర ఎరువులకు ఎటువంటి కొరత లేదని, వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని గుంటూరు డీసీఎంఎస్ ఛైర్మన్ హరిబాబు నాయుడు అన్నారు. గురువారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 15 లక్షల టన్నుల యూరియా అందించామని, అలాగే 36.88 లక్షల టన్నుల డీఏపీతో పాటు ఇతర ఎరువులు కూడా అందించామన్నారు. కావాలనే వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.