గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం విజన్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆదికర్మయోగి అభియాన్‌లో ఎంపికైన 23 పంచాయతీల అధికారులు, సిబ్బందికి మొదటి రోజు శిక్షణ తరగతులు గురువారం నిర్వహించారు. ఎంపికైన 23 పంచాయతీల్లోని పీవీటీజీ గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, వైద్యం,పారిశుద్ధ్య పరిస్థితులు పూర్తిగా పరిశీలించి, మౌలిక వసతులపై నివేదిక తయారు చేయాలన్నారు.