నాగిరెడ్డిపేట మండలంలోని మారుమూల తండాకు చెందిన కోర్ర కళ్యాణ్ అనే విద్యార్థి ఆల్ ఇండియా నీట్లో 1,38,000 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2300 ర్యాంకు సాధించి MBBS సీటును కైవసం చేసుకున్నారు. మెల్లకుంట తండాకు చెందిన కొర్ర గోవిందు, రుక్మిణి దంపతుల కుమారుడైన కళ్యాణ్ కు సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు లభించింది. ఈ సందర్భంగా మండలవాసులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థిని అభినందించి, తండావాసులు ఆదివారం సాయంత్రం సంతోషం వ్యక్తం చేశారు.