సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్ సాగర్ చెరువు రాత్రి కురిసిన భారీ వర్షంతో పూర్తి స్థాయిలో నిండి బుధవారం పొంగి పొలుతుంది. కాగా బాబు సార్ చెరువు వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని సూచన చేశారు.