ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం చెన్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు.